ఈ నెల 17 నుండి మెట్రో రైలు ఛార్జీలు పెంపు

హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరగనున్నాయి. మెట్రో రైలులో ప్రయాణించేందుకు కనీస ఛార్జి రూ.10 ఉండగా.. రూ.12కి.. గరిష్ట ఛార్జి రూ.60 ఉండగా.. రూ.75కి పెరగనున్నట్లు సమాచారం. ఈ మేరకు నగర మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది. పెరిగిన రైలు ఛార్జీలు మే 17వ తేదీ నుండి అమలులోకి రానున్నాయి.
పెరిగి ఛార్జీల వివరాలు
మొదటి రెండు స్టాప్‌లకు రూ.12
రెండు నుండి 4 స్టాప్‌ల వరకు రూ.18
4 నుండి 6 స్టాప్‌ల వరకు రూ.30
6 నుండి 9 స్టాప్‌ల వరకు రూ.40
9 నుండి 12 స్టాప్‌ల వరకు రూ.50
12 నుండి 15 స్టాప్‌ల వరకు రూ.55
15 నుండి 18 స్టాప్‌ల వరకు రూ.60
18 నుండి 21 స్టాప్‌ల వరకు రూ.66
21 నుండి 24 స్టాప్‌ల వరకు రూ.70
24 నుండి ఆపైనా రూ.75