ఇండియ‌న్ నేవీలోకి ఎంహెచ్‌-60ఆర్ హెలికాప్ట‌ర్లు

న్యూఢిల్లీ (CLiC2NEWS): అమెరికా నౌకాద‌ళం సికోర్స్కీ ఎంహెచ్‌60ఆర్ మ‌ల్టీ రోల్ హెలికాప్ట‌ర్ల‌ను భార‌త్‌కు అప్ప‌గించింది. తొలి ద‌శ‌లో భాగంగా రెండు హెలికాప్ట‌ర్ల‌ను ఇండియ‌న్ నేవీకి అందేశారు. ఈ మేర‌కు వైస్ అడ్మిర‌ల్ కెన్నెత్ వైట్‌సెల్‌, వైస్ అడ్మిర‌ల్ రవ్‌నీత్ సింగ్ ఒప్పంద డాక్యుమెంట్ల‌ను మార్చుకున్నారు. సాన్‌డియాగోలోని నార్త్ ఐల్యాండ్‌లోని నావెల్ ఎయిర్ స్టేష‌న్‌లో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. భార‌త్ 24 సికోర్స్కీ హెలికాప్ట‌ర్ల‌కు ఆర్డ‌ర్ ఇచ్చింది. సుమారు 2.4 బిలియ‌న్ల డాల‌ర్లు పెట్టి ఎంహెచ్‌-60ఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఇండియా అంబాసిడ‌ర్ త‌ర‌న్‌జిత్ సింగ్ సంధూ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.