సైనిక భవనం గోడ కూలి.. 9మంది మృతి
లఖ్‌నవూ (CLiC2NEWS): ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు కారంణంగా పలు ప్రాంతాలు జలమయ్యాయి. వరద సంబంధిత ఘటనల్లో 12మంది మృతి చెందినట్లు సమాచారం. లఖ్‌నవూలోని ఓ సైనిక భవనం ప్రహరీ గోడ కూలి తొమ్మిది మంది మృతి చెందారు. ఈ సైనిక భవనాన్ని ఆనుకొని కొంతమంది కూలీలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. భారీ వర్షాల వల్ల గోడ కూలి గుడిసెలపై పడటంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. మరొక ప్రాంతంలో ఓ ఇంటి పైకప్పు కూలి ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మరణించారు. ఈ ఘటనలపై రాష్ట్ర సిఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు , ప్రమాదంలో గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించారు.