నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ గ్రౌండ్‌ లో మినీ నుమాయిష్

హైద‌రాబాద్ (CLiC2NEWS) : నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ గ్రౌండ్‌‌లో ఆల్ ఇండియా ఇండ‌స్ట్రియ‌ల్ ఎగ్జిబిష‌న్ సొసైటీ ఆధ్వ‌ర్యంలో మినీ నుమాయిష్ ప్రారంభ‌మైంది. అక్టోబ‌ర్ 31వ తేదీ వ‌ర‌కు ప్ర‌తి రోజు సాయంత్రం 4 గంట‌ల నుంచి రాత్రి 10:30 గంట‌ల‌ వ‌ర‌కు ఉంటుంది. నుమాయిష్ లోకి ప్ర‌వేశ రుసుమును రూ. 25గా నిర్ణ‌యించారు. ఇక్క‌డ‌‌కు వ‌చ్చే ప్ర‌తి ఒక్క‌రూ మాస్కు ధ‌రించాల‌ని నిర్వాహ‌కులు తెలిపారు. ప్ర‌వేశం వ‌ద్ద శానిటైజ‌ర్ల‌ను అందుబాటులో ఉంచ‌డంతో పాటు ప్ర‌తి ఒక్క‌రిని డిజిట‌ల్ థ‌ర్మామీట‌ర్‌తో ప‌రీక్షించి లోప‌లికి పంపేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. మాస్కు ధ‌రించ‌ని వారిని నుమాయిష్‌కు అనుమ‌తించ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ సంవత్సరం నుమాయిష్‌ నిర్వహించకపోవడంతో కష్టాల్లో ఉన్న చిన్న పరిశ్రమలు, చేతివృత్తుల వారిని ప్రోత్సహించేందుకు, 300 స్టాళ్ల ఏర్పాటుకు అవకాశమిచ్చారు.

 

Leave A Reply

Your email address will not be published.