ఎపి టెన్త్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ పరీక్షల పలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో సోమవారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. 78.3 శాతంతో ప్రకాశం జిల్లా మొదటి స్థానం దక్కించుకోగా, 49.7 శాతంతో అనంతపురం జిల్లా చివరిస్థానంలో ఉంది. రాష్ట్రంలో రెండులక్షల 99 వేల 85 మంది పరీక్షలు రాయగా రెండు లక్షల 11 వేల 460 మంది పాసయ్యారు. కాగా ఈ ఫలితాల్లో 64.02 శాతం బాలురు, 70.70 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులు అయ్యారు.
797 పాఠశాలల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. 71 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు.
కాగా జూలై 6 నుంచి 15 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.