మల్లారంలోని పంపు హౌస్‌ను సందర్శించిన మంత్రి హరీష్ రావు.

భారీ వర్షాలకు మల్లారం లో ని పంపు హౌస్ లోకి వరద నీరు.

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ నగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న గోదావరి పథకంలోని మల్లారంలోని జలమండలి మంచి నీటి శుద్ధి కేంద్రంలోని పంప్ హౌస్ లోకి వరద నీరు చేరింది. దీంతో తొమ్మిది పంపులు నీట మునిగిపోయాయి.
దీంతో హరీశ్ రావు స్థానిక సిద్దిపేట ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి జలమండలి ఎండీ దాన కిశోర్ తో కలిసి పంపు హౌస్ ను సందర్శించి పునరుద్ధరణ పనులను సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… సిద్దిపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలకు పంపు హౌస్ లోకి వరద చేరడంతో ముందస్తు జాగ్రత్తగా పంపింగ్ ప్రక్రియను నిలిపివేసిన్నట్టు.. అలాగే పంపు హౌస్ నుంచి నీటిని తోడి పునరుద్ధరణ పనులు చేపట్టినట్టు చెప్పారు. దీనివల్ల సిద్దిపేట, మేడ్చెల్, జనగామ, హైదరాబాద్ జిల్లాలో మంచినీటి సరఫరా అంతరాయం ఏర్పడిందని, దీనికి ప్రత్యామ్నా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.
జలమండలి ఎండీ దాన కిశోర్ మాట్లాడుతూ.. పంపు హౌస్ లోకి వరద నీరు చేరి హైదరాబాద్ కు శుద్ధి చేసిన నీటిని పంపింగ్ చేసే తొమ్మిది పంపులు నీట మునిగాయని, ఈ వరద నీటిని తోడి బయటకి పంపింగ్ ప్రక్రియ జరుగుతోందని, పునరుద్ధరణ పనులు అనంతరం యధావిధిగా పంపింగ్ మొదలవుతుందని ఆయన చెప్పారు.
ఈ పునరుద్ధరణ పనులు పూర్తి చేసి తిరిగి పంపింగ్ చేయడానికి మరో 36 నుంచి 48 గంటలు పడుతుందని, మంచినీటి సరఫరా ప్రభావిత ప్రాంతాల్లో ట్యాంకర్ ల ద్వారా మంచినీటిని అందిస్తున్నట్లు ఈ సందర్భంగా ఎండీ వెల్లడించారు.
అలాగే గోదావరి పథకం ద్వారా సరఫరా జరిగే ప్రాంతాల్లో ముఖ్యంగా నగరంలోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, సైనిక్‌పురి, మల్కాజిగిరి, పటాన్ చెరు, నిజాంపేట్, బాచుపల్లి తదితర ప్రాంతంల్లో సరఫరాకు అంతరాయం ఏర్పడిందని, ఈ ప్రాంతాలకు సింగూరు, మంజీరా, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి అందనంగా నీటిని తరలించి సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.
భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పల్లెచెరువు నుండి వచ్చే వరద నీటిని నిరోధించడానికి ప్రహరీ గోడను నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారాయణ, టెక్నికల్ డైరెక్టర్ రవి కుమార్ ట్రాన్సమిషన్, ఎలక్ట్రిక్ విభాగం అధికారులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.