ఎన్ని కుట్రలు పన్నినా.. ఉచిత విద్యుత్ ఆపే ప్రసక్తే లేదన్న మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట (CLiC2NEWS): కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టంచినా పేదలకు అందించే ఉచిత విద్యుత్ ఆపే ప్రసక్తే లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. రాయితీ విద్యుత్ ఛార్జీలను డిస్కంలకు ముందస్తుగా చెల్లించాలనే కేంద్ర నూతన విద్యుత్ విధానంపై మంత్రి మాట్లాడుతూ.. రైతులకు ఉచిత విద్యుత్ అందించడం కేంద్రానికి కంటగింపుగా ఉందని ధ్వజమెత్తారు. పేద రైతులను ఆదుకునే ఉద్దేశంతో సబ్సిడీ ఇస్తున్నామని.. కేంద్రం ప్యూడల్ ఆలోచనలతో పేదలకు తీవ్ర నష్టం వాటిల్లనుందని ఆయన అన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా కెసిఆర్ ఉన్నంతవరకు రైతుకు ఉచిత విద్యుత్ అందిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే దురాలోచన చేస్తుందని.. కేంద్రం నూతన విద్యుత్ విధానంను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.