ప్రణాళికాబద్ధంగా చదవండి.. ప్రభుత్వ ఉద్యోగం సాధించండి: మంత్రి కెటిఆర్
సిరిసిల్ల (CLiC2NEWS): రాష్ట్రంలో యువత ఈ మూడు నెలలు ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదివి.. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ పిలలుపునిచ్చారు. మొబైల్స్ వాడకాన్ని తగ్గించాలని పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు కెటిఆర్ సూచించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ను కెటిఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితం చాల పెద్దది.. అపజయం ఎదురైనంత మాత్రాన కుంగిపోవద్దని చెప్పారు. నైపుణ్యం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటే ప్రయివేటు రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా సాధించుకున్న తెలంగాణలో.. ఎన్నో అద్భుతాలు సృష్టించామని పేర్కొన్నారు.