‘ఇన్‌స్టాషీల్డ్’ ను ఆవిష్కరించిన మంత్రి కెటిఆర్
కరోనా, డెల్టా, ఒమిక్రాన్ వంటి వైరస్‌లను సంహరించే పరికరం

హైదారాబాద్ (CLiC2NEWS): నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన శాస్త్రవేత్త మండాజి నర్సింహాచారి రూపొందిన ‘ఇన్‌స్టాషీల్డ్’ వైరస్ కిల్లర్ పరికరాన్ని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాక మంత్రి కెటిఆర్ శనివారం ఆవిష్కరించారు. కరోనా , డెల్టా, ఒమిక్రాన్ తదితర వైరస్‌లను నెగెటివ్ ఎలక్ట్రాన్ల సహాయంతో ఇన్‌స్టాషీల్డ్ సంహరిస్తుంది.
ఈసందర్భంగా మంత్రి డివైజ్ రూపకర్త నర్సింహచారిని అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ఆవిష్కరణ అద్భుతంగా ఉందని, అందరికీ ఉపయోగపడుతుందన్నారు. ఇన్‌స్టాషీల్డ్ ఉత్పత్తికి పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వ పరంగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. పరికరం రూపొందించిన తీరు, పనితీరును అడిగి తెలుసుకున్నారు. గతంలో నర్సింహాచారి ఇంటింటా ఇన్నోవేటర్ పురస్కారానికి ఎంపికయ్యారని, ఇపుడు ఈ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉందని మంత్రి అన్నారు. ఇన్‌స్టాషీల్డ్ ప్రతి ఒక్కరికీ దీన్ని చేర్చడమే తన జీవితాశయమని నర్సింహాచారి అంటున్నారు.