బహదూర్ పురా ఫ్లైఓవర్ ప్రారంభించిన మంత్రి కెటిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ఐటి, పరిశ్రమల మంత్రి కెటిఆర్ నగరంలోని పాతబస్తీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు. దాదాపు రూ. 485 కోట్ల విలువైన ఆరు పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. తొలుత హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపి అసదుద్దీన్ ఓవైసీతో కలిసి బహదూర్‌పురా ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు.
కాలాపత్తర్ పోలీస్ స్టేషన్, ముర్గీ చౌక్, మీర్ అలం మార్కెట్ పునర్ నిర్మాణం, చార్మినార్‌లోని సర్దార్ మహల్ రీ స్టోరేషన్, కార్వాన్ నియోజకవర్గంలో సీవరేజ్ పనులకు కెటిఆర్ శంకు స్థాపన చేశారు. అలాగే మీర్ అలం చెరువు వద్ద మ్యూజికల్ ఫౌంటేన్‌ను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. ప్రపంచ వారసత్వ దినోత్సవం రోజు రోజు సర్దార్ మహల్ పనులు ప్రారంభించామన్నారు. రూ. 109 కోట్లతో బహదూర్‌పురా ఫ్లైఓవర్‌ను నిర్మించినట్లు చెప్పారు. పాతబస్తీ ఇతర ప్రాంతాల్లో ఉన్న నోటరీ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.