రాష్ట్రంలో విఆర్ఎల డిమాండ్ల ప‌రిష్కారానికి స‌ర్కార్ సానుకూలం: మంత్రి కెటిఆర్‌

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాన రాష్ట్రంలో విఆర్ఎల‌తో రాష్ట్ర ఐటి, పురపాల‌క శాఖ‌ మంత్రి కెటిఆర్ స‌మావేశ‌మ‌య్యారు. రాష్ట్రంలోని విఆర్ఎలు త‌మ స‌మస్య‌ల‌ను ప‌రిష్కారించాలంటూ ఆందోళ‌న చేప‌ట్టిన విష‌యం తెలిసిన‌దే. అసెంబ్లీ ప్రాంగ‌ణంలో వారితో మాట్లాడిన మంత్రి కెటిఆర్.. విఆర్ఎల డిమాండ్ల‌పై చ‌ర్చించేందుకు, స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించడానికి ప్ర‌భుత్వం సానుకూలంగా ప‌రిశీలిస్తుంద‌ని హామీ ఇచ్చారు. ఆందోళ‌న విర‌మించి రాష్ట్రంలో జ‌ర‌గ‌నున్న జాతీయ స‌మైక్య‌తా వ‌జ్రోత్స‌వాల‌లో భాగం కావాల‌ని, అంద‌రూ విధుల్లోకి రావాల‌ని కోరారు. రాష్ట్ర ప్ర‌భుత్వం సెప్టెంబ‌ర్ 17వ తేదీన జాతీయ స‌మైక్య‌తా వ‌జ్రోత్స‌వాలు నిర్వ‌హిస్తున్నాయి. వ‌జ్రోత్స‌వాలు ముగిసిన అనంత‌రం ఈ నెల 20వ తేదీన విఆర్ఎ సంఘ ప్ర‌తినిధుల‌తో సిఎస్ చ‌ర్చ‌లు జరుపుతార‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. మంత్రి కెటిఆర్‌ త‌మ వాద‌న‌లు వినడం ప‌ట్ల విఆర్ఎ సంఘ ప్ర‌తినిధులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.