బాసర ఆర్‌జియుకెటి విద్యార్థులతో మంత్రి కెటిఆర్ సమావేశం
బాసర (CLiC2NEWS): ఆర్‌జెయుకెటి విద్యార్థులతో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు. వర్సిటీలో గత కొంత కాలంగా నెలకొన్న సమస్యలను పరిష్యరించేందుకు సోమవారం రాష్ట్ర మంత్రులు కెటిఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ విద్యార్థులతో సమావేశమయ్యారు. పూర్తిస్థాయి విసి, అధ్యాపకులను నియమించాలని, ఇతర డిమాండ్లను పరిష్కరించాలని బాసర ఆర్‌జెయుకెటి విద్యార్థులు జూన్ నెలలో నిరసనలు చేపట్టిన విషయం తెలినదే.
ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. సమ్మెకోసం విద్యార్థులు ఎంచుకున్న పద్దతి నచ్చిందన్నారు. రాజకీయ పార్టీలకు అవకాశం ఇవ్వకుండా.. గాంధీ సత్యాగ్రహం లానే శాంతియుతంగా సమ్మె చేశారు. సమస్యలను పరిష్కరించాలని మీరు చేసిన ఆందోళనను పత్రికలలో చూశాను. సంతృప్తికర స్థాయిలో సౌకర్యాలు, వసతులు కల్పించాలని విద్యార్థులు కోరారని కెటిఆర్ తెలిపారు. నవంబర్ నెలలో అందరికీ ల్యాప్‌టాప్‌లు ఇస్తామని అన్నారు.
హాస్టల్ కష్టాలు తనకు తెలిసుననవి.. నా జీవితం 70% హాస్టల్లోనే గడిచిందని ఈ సందర్భంగా తెలిపారు. సమస్యలను పరిష్కరించే సరికి సమయం పడుతుందని అన్నారు. నవంబర్‌లో మళ్లీ వచ్చేసరికి అందరికీ కుర్చీలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆడిటోరియంలో మార్పులు చేయాలని ఆదేశాలు జారీ చేస్తామన్నారు. నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.