విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రేవీటీక‌ర‌ణ ఆపాల‌ని.. మంత్రి కెటిఆర్ బ‌హిరంగ లేఖ‌‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ ఆపాల‌ని రాష్ట్ర ఐటి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కెటిఆర్ కేంద్ర ప్ర‌భుత్వానికి బ‌హిరంగ లేఖ రాశారు. ఈ సంద‌ర్భంగా ఉక్కు ప‌రిశ్ర‌మ ప్రైవేటీక‌ర‌ణ ఆపాల‌ని డిమాండ్ చేశారు. కార్పొరేట్ల‌కు రూ. 12.5 ల‌క్ష‌ల కోట్ల రుణాలు కేంద్ర ప్ర‌భుత్వం మాఫీ చేసింద‌ని.. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఎందుకు ఔదార్యం చూప‌డం లేద‌ని మంత్రి ప్ర‌శ్నించారు. విశాఖ ఉక్కు ఉత్ప‌త్తుల‌ను కేంద్రం కొన‌గోలు చేయాల‌ని.. వ‌ర్కింగ్ క్యాపిట‌ల్‌కు ఆర్ధిక సాయం అందించాల‌ని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉక్కు ప‌రిశ్ర‌మ‌కు రూ. 5 వేల కోట్లు కేటాయించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని మంత్రి కోరారు.

Leave A Reply

Your email address will not be published.