రెండో రాజధానిగా వరంగల్ అభివృద్ధి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్
వరంగల్ (CLiC2NEWS): వరంగలో లోని భద్రకాళి అమ్మవారిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్‌ను రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు. అమ్మవారి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామని, ఆలయ మాడ వీధులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.ఇక్కడి జలాశయాన్ని తాగునీటి జలాశయంగా మారుస్తామని, భద్రకాళి చెరువు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని .. సర్వే చేయించి నిర్మాణాలను తొలగిస్తామని మంత్రి తెలిపారు.