గ‌వ‌ర్న‌ర్‌తో భేటీ అయిన విద్యాశాఖ మంత్రి

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి గురువారం రాష్ట్రప‌తితో భేటీ కానున్నారు. ఈ మేర‌కు గురువారం సాయంత్రం 5 గంట‌ల‌కు రాజ్‌భ‌వ‌న్ అపాయింట్‌మెంట్ ల‌భించింది. ఇటీవ‌ల తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై సౌంద‌ర‌రాజ‌న్ విశ్వ‌విదాయ‌ల‌లో ఉమ్మ‌డి నియామ‌క బోర్డు విష‌యంలో త‌న‌కు సందేహాలు ఉన్నాయ‌ని.. వాటిని నివృత్తి చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరిన విష‌యం తెలిసిన‌దే. ఈ క్ర‌మంలో విద్యాశాఖ మంత్రి స‌బిత‌, అధికారులు గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసేందుకు రాజ‌భ‌వ‌న్ అపాయింట్‌మెంట్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.