మంత్రి స‌బితా ఇంద్రారెడ్డిపై తీగ‌ల కృష్ణారెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!

మీర్‌పేట‌ను మంత్రి నాశ‌నం చేస్తున్నారుః తీగ‌ల ఆరోప‌ణ‌లు

హైద‌రాబాద్ (CLiC2NEWS): విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డిపై టిఆర్ ఎస్ నేత‌, మాజీ మేయ‌ర్‌ తీగ‌ల కృష్ణారెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మంత్రి స‌బితా భూ క‌బ్జాల‌ను ప్రోత్స‌హిస్తున్నారంటూ ఆయ‌న మండి ప‌డ్డారు. మీర్‌పేట‌ను స‌బిత నాశ‌నం చేస్తున్నారంటూ ఆయ‌న ఆరోపించారు. చెరువుల‌ను, స్కూల్ స్థ‌లాల‌ను కూడా వ‌ద‌ల‌డం లేద‌ని ఆరోపించారు. అభివృద్ధిని మంత్రి స‌బిత గాలికోదిలేశారని అన్నారు. ఈ అక్ర‌మాల‌పై అవ‌స‌ర‌మైతే ఆమ‌ర‌ణ దీక్ష కూడా చేస్తాన‌న్నారు. మంత్రి స‌బిత వైఖ‌రిపై ముఖ్య‌మంత్రి కెసిఆర్‌తో మాట్లాడ‌తాన‌ని తీగ‌ల కృష్ణారెడ్డి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.