ఆదివాసి బిడ్డగా జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా.. మంత్రి సీతక్క

ఇంద్రవెల్లి (CLiC2NEWS): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి సీతక్క ఇంద్రవెల్లిలో పర్యటనలో భాగంగా బుధవారం గిరిజన అమరవీరులకు నివాళులర్పించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఆదివాసి బిద్డగా, జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ముందుగా సీతక్క జిల్లా కలెక్టరేట్లో ప్రజాపాలన కార్యక్రమంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఎస్పిలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణసై అధికారులకు దిశానిర్దేశం చేశారు. దరఖాస్తు స్వీకరణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మంత్రితో పాటు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పాల్గొన్నారు.