గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ ఇంటర్నెట్
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా టి ఫైబర్ సేవలను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టి ఫైబర్ ద్వారా మెబైల్, కంప్యూటర్ , టివి వినియోగించవచ్చని , ఈ సేవలను మరింత సౌకర్యంగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. మీసేవ మొబెల్ యాప్‌ను ప్రారంభించారు. దీనిలో కొత్త సేవలు.. రైతులకు రుణమాఫీ, బోనస్ కోసం మొబైల్ అప్లికేషన్ ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.
మీసేవ ద్వారా 150 రకాల పౌరసేవలను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రత్యేక ‘మొబైల్ యాప్’ను ప్రారంభించారు. దీనితో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయం కలగనుంది. టి ఫైబర్ పైలట్ ప్రాజెక్టు కింద ముందుగా మూడు గ్రామాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మూడు జిల్లాల్లో ఒక్కో గ్రామంలో 4వేల కుటుంబాలకు కేబుల్ టివి సేవలతో కూడిన బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. పెద్దపల్లిలోని అడవి శ్రీరాంపూర్, సంగారెడ్డిలోని సంగుపేట, నారాయణపేటలోని మద్దూర్‌లో తొలుత ఈ సేవలు రానున్నాయి.
మీసేవ ద్వారా 150 రకాల పౌరసేవలు.. ప్రజలు ఇంటి నుండే ఈ సేవలు పొందేందుకు వీలుగా మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. షాపింగ్‌మాల్స్, మెట్రో స్టేషన్లు, సమీకృత కలెక్టరేట్లు ఇతర రద్దీ ప్రాంతల్లో ఇంటరాక్టివ్ కియోస్క్ ద్వారా ప్రజలు ఈ సేవలు వినియోగించుకోవచ్చు. దరఖాస్తు నింపడం, చెల్లిపులు చేయడం, సర్టిఫికెట్ ప్రింట్ తీయటం వంటి వాటికి అవకాశాలు కల్పించనున్నారు. ఇవే కాకుండా పర్యాటక శాఖ హోటల్స్, పర్యాటక ప్యాకేజిల బుకింగ్, దివ్యాంగుల గుర్తింపుకార్డులు, వయోవృద్ధులు సంక్షేమ కేసుల పర్యవేక్షణ, సదరం సర్టిఫికెట్ల జారీ ,అటవీశాఖకు సంబంధించి వన్యప్రాణుల బాధితులకు సహాయం , టింబర్ డిపోలు, కలప మిల్లుల పర్మిట్ల పునరుద్ధరణ, కొత్తవి జారీ, వాల్టా చట్టం కింద చెట్ల తొలగింపు, తరలింపుకు సంబంధించిన అనుమతులు ఉన్నాయి.