హైద‌రాబాద్‌ను 360 డిగ్రీలు క‌వ‌ర్ చేసేలా మెట్రో విస్త‌ర‌ణ‌: మంత్రి శ్రీధ‌ర్‌బాబు

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించే ఉద్దేశంతోనే ప్ర‌ణాళిక రూపొందించిన‌ట్లు మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు అన్నారు. అసెంబ్లీలో పుర‌పాల‌క‌, జిహెచ్ ఎంసి చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుపై చ‌ర్చ‌లో శ్రీ‌ధ‌ర్‌బాబు మాట్లాడుతూ.. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ను ఎన్ని కార్పొరేష‌న్లుగా విభ‌జిస్తామ‌నేది ఇంకా నిర్ణ‌యించ‌లేద‌న్న ఆయ‌న‌.. ఎన్ని కార్పొరేష‌న్లుగా విభ‌జించాలో అంద‌రి అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ‌తామ‌న్నారు. గ్రేట‌ర్‌ను మూడు కార్పొరేష‌న్లుగా విభ‌జించాల‌ని ప్రాథమికంగా అనుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. న‌గ‌రంలో ఎయిర్ క్వాలిటి ఇండెక్స్ 174 పాయింట్లు ఉంద‌ని.. గాలి నాణ్య‌త మున్ముందు మ‌రింత ప‌డిపోకూడ‌ద‌నే ప‌రిశ్ర‌మ‌ల‌ను ఓఆర్ ఆర్ కు అవ‌త‌లకు త‌ర‌లించే ప్ర‌క్రియ చేపట్టిన‌ట్లు తెలిపారు. హైద‌రాబాద్ న‌గ‌రానికి 360 డిగ్రీలు క‌వ‌ర్ చేసేలా మెట్రో విస్త‌ర‌ణ చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. మెట్రో రైలు ప్రాజెక్టును ప్ర‌భుత్వ‌మే టేకోవ‌ర్ చేస్తోంద‌న్నారు. న‌గ‌రంలో పూర్తిగా ఎల‌క్ట్రిక్ బ‌స్సులే తిరిగేలా చూస్తామ‌ని మంత్రి తెలిపారు.

 

సంక్రాంతి ర‌ద్దీ.. మ‌రో 11 ప్ర‌త్యేక రైళ్లు..

Leave A Reply

Your email address will not be published.