అతిపెద్ద న‌గ‌రంగా హైద‌రాబాద్ అభివృద్ది సంతోషం: కూనంనేని సాంబ‌శివ‌రావు

హైద‌రాబాద్‌ (CLiC2NEWS):  హైద‌రాబాద్‌.. ప్ర‌పంచ మ‌హాన‌గ‌రంగా మారాల‌ని గొప్ప‌లకు పోతే తిప్ప‌లు త‌ప్ప‌వ‌ని సిపిఐ ఎమ్మెల్సి కూనంనేని సాంబ‌శివ‌రావు అన్నారు. అసెంబ్లీ స‌మావేశం నేప‌థ్యంలో ఆయ‌న మాట్లాడుతూ.. మున్సిపాలిటీల విలీనంతో హైద‌రాబాద్ అతిపెద్ద న‌గ‌రంగా అభివృద్ధి చెంద‌డం సంతోషంగా ఉంద‌న్నారు. వికేంద్రీక‌ర‌ణ విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించాల‌ని, ప‌రిపాల‌న సామ‌ర్ధ్యాన్ని స‌రిచూసుకోవాల‌ని కూనంనేని సాంబ‌శివ‌రావు సూచించారు.

చిన్న చిన్న వ‌ర్షాల‌కే న‌గ‌రంలో ట్రాఫిక్జామ్ అవుతుంద‌ని ఈ సంద‌ర్భంగా గుర్తుచేశారు. మ‌హాన‌గ‌రంలో జిల్లాలు విలీనం అవ‌డం, ప్ర‌పంచంలో ఉన్న సౌక‌ర్యాలు క‌ల్పించే అవ‌కాశం ఉంద‌న‌డంపై పూర్తిస్థాయిలో అధ్య‌యనం చేయాల్సి అవ‌స‌ర‌ముంద‌ని కూనంనేని అభిప్రాయ‌ప‌డ్డారు. అదేవిధంగా కాలుష్యం, డ్రేనేజి, రోడ్డు విస్త‌ర‌ణ వంటి విష‌యాల‌పై మేధావుల‌తో చ‌ర్చించి నిర్ణ‌యించాల‌ని ప్ర‌భుత్వానికి ఆయ‌న సూచించారు.

న‌గ‌రానికి 360 డిగ్రీలు క‌వ‌ర్ చేసేలా మెట్రో విస్త‌ర‌ణ‌: మంత్రి శ్రీధ‌ర్‌బాబు

Leave A Reply

Your email address will not be published.