టన్నెల్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం..

నాగర్ కర్నూల్ (CLiC2NEWS): ఎస్ ఎల్‌బిస టన్నెల్ వద్ద జరిగిన ప్రమాద ఘటన స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 8 మంది కార్మికులు బోరింగ్ మిషన్ ముందు ఉండటంతో లోపలే చిక్కుకుపోయారు. ఎడమవైపు సొరంగం 14 కిలోమీటర్ల లోపల ఇరుక్కు పోవడంతో వారిని బయటకు తీసుకురావడం సవాల్‌గా మారింది. రెస్క్యూ సిబ్బంది ఈ రాత్రికి ఘటనా స్థలానికి చేరుకోనున్నట్లు సమాచారం. మంత్రులు ఉత్తమ్ కుమర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
శనివారం ఉదయం 8 గంటలకు కార్మికులు టన్నెల్ లోపలికి వెళ్లారు. 8.30 గంటలకు బోరింగ్ మిషన్ ఆన్ చేయగా.. టన్నెల్ లో ఓ వైపు నుండి నీరు లీకై మట్టి కుంగి పెద్ద శబ్దం వచ్చింది. టిబిఎం ఆపరేటర్ ప్రమాదాన్ని ముందే పసిగట్టారు. వెంటనే అప్రమత్తమై 42 కార్మికులు మంది బయటకు వచ్చారు. మిగిలిన 8 మంది లోపలే చిక్కుకు పోయారు. వీరంతా ఉత్తర్ ప్రదేశ్, ఝార్ఖండ్ వాసులు . వీరిలో ఒక ప్రాజెక్టు ఇంజినీరు, ఫీల్డ్ ఇంజినీరు, నలుగురు కార్మికులు, జమ్ముకశ్మీర్, పంజాబ్‌కు చెందిన ఇద్దరు బోరింగ్ మిషన్ ఆపరేటర్లు ఉన్నారు. లోపల చిక్కుకు పోయిన వారిని కాపాడేందుకు ప్రబుత్వం అన్ని చర్లయు తీసుకుంటుందని.. వారి ప్రాణాలు కాపాడేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు.