ఉగాది రోజున పేద‌ల జీవితాల్లో విప్ల‌వాత్మ‌క మార్పు.. మంత్రి ఉత్త‌మ్‌

హుజూర్‌న‌గ‌ర్ (CLiC2NEWS): అర్హులైన వారంద‌రికీ రేష‌న్ కార్డులిస్తామ‌ని మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి తెలిపారు. హుజూర్‌న‌గ‌ర్‌లో స‌న్న‌బియ్యం ప‌థ‌కాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్రంలో 85% మంది జ‌నాభాకు స‌న్న‌బియ్యం అంద‌నుంద‌ని.. బియ్యంతో పాటు త్వ‌ర‌లోనే ప‌ప్పు, ఉప్పు లాంటి ఇత‌ర స‌ర‌కులు ఇస్తామ‌ని వెల్ల‌డించారు. ఉగాది రోజున పేద‌ల జీవితాల్లో విప్ల‌వాత్మ‌క మార్పు రానుంద‌ని అన్నారు.

చాలా మంది రేష‌న్ బియ్యాన్ని ఉప‌యోగించ‌డం లేద‌ని.. దొడ్డు బియ్యంను కొంద‌రు బ్లాక్‌లో అమ్ముకుంటున్నార‌ని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ఎక్క‌డైనా రేష‌న్ తీసుకునేలా చేశామ‌ని.. కొత్త రేష‌న్ కార్డులు ఎంత‌మందికి కావాల‌న్నా అర్హ‌త‌ను బ‌ట్టి ఇస్తున్నామ‌న్నారు. కార్డు లేకున్న ల‌బ్ధిదారుల‌కు జాబితాలో పేరు ఉంటే బియ్యా ఇస్తామ‌ని మంత్రి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.