Miryalaguda: బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి ఇంట్లో ఐటి సోదాలు

మిర్యాల‌గూడ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలోని హైద‌రాబాద్‌తో పాటు న‌ల్గొండ‌, మిర్యాల‌గూడ‌లో ఏక‌కాలంలో 40 బృందాల‌తో ఐటి అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ఒక్క న‌ల్గొండ‌లోనే 30 బృందాల‌తో త‌నిఖీలు చేస్తున్నట్లు స‌మాచారం. మిర్యాల‌గూడ‌లోని బిఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి న‌ల్ల‌మోతు భాస్క‌ర‌రావు ఇంట్లో గురువారం తెల్ల‌వారుజామున 4 గంట‌ల నుండి త‌న‌ఖీలు చేస్తున్నారు. ఆయ‌న‌కు దేశ‌వ్యాప్తంగా ప‌లు వ్యాపారాలు ఉన్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో డ‌బ్బు నిల్వ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో ఈ సోదాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు స‌మాచారం. భాస్క‌ర‌రావుతో పాటు ఆయ‌న అనుచ‌రులు, బంధువులు ఇళ్ల‌లో కూడా సోదాలు నిర్వ‌హిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.