‘మిస్ పర్ఫెక్ట్’గా లావణ్య త్రిపాఠి.. టీజర్ విడుదల
![](https://clic2news.com/wp-content/uploads/2024/01/lavanya-tripati.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): వివామం తర్వాత లావణ్య త్రిపాఠి నటించిన వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్. విశ్వక్ దర్శకత్వంలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘మిస్ పర్ఫెక్ట్’.. డిస్నీ+హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో సిరీస్ టీజర్ విడుదలైంది. రొమాంటిక్ కామెడి సిరీస్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సిరీస్‌లో బిగ్ బాస్ విజేత, నటుడు అభిజిత్ హీరోగా కనిపించనున్నాడు. నటుడు వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి నవంబర్‌లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వివాహమైన తర్వాత తొలి ప్రాజెక్ట్‌గా మిస్పర్ఫెక్ట్ వెబ్ సిరీస్‌తో ఆమె ప్రేక్షకుల ముందుకు రానుంది.