Miss Universe : కిరీటం మెక్సికో సొంతం
వాషింగ్టన్: మిస్ యూనివర్స్ 2020 కిరీటాన్నిమెక్సికో దేశానికి చెందిన 26 ఏళ్ల ఆండ్రియా మెజా సొంతం చేసుకుంది. ఈ అందాల కిరీటం మూడోసారి మెక్సికన్ వశమైంది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆండ్రియా అందం అనేది మన ఆలోచనల్లో, గుండెల్లో ఉంటుందని, అది ప్రవర్తనను, విలువను చాటేందుకు ఒక కొలమానంగా నిలుస్తుందని పేర్కొన్నది. ఇక ఈ కార్యక్రమంలో 73 దేశాల ముద్దుగుమ్మలు పాల్గొన్నారు. మిస్ సౌతాఫ్రికా జోజిబినితుంజి మెజాకు కిరీటాన్ని అలంకరించారు. మన దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన అడిలైన్ క్యాస్టిలినో మూడో రన్నరప్‌గా నిలిచారు.

ఆండ్రియా మెజా.. మెక్సికోలోని చిహువాకు చెందినవారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకున్నారు. మహిళా హక్కులపై ఉద్యమిస్తూ.. లింగ వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నారు. చిహువా టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ తమ సంస్కృతీ సంప్రదాయాల గురించి ప్రపంచానికి చాటి చెబుతున్నారు.