హైదరాబాద్‌లో అట్టహాసంగా మిస్ వరల్డ్ -2025 పోటీలు ప్రారంభం

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ – 2025 పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 72వ మిస్ వరల్డ్ పోటీలకు 110పైగా దేశాలకు చెందిన సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. వారంతా నగరానికి చేరుకున్నారు. భారత్ తరపున మిస్ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం వహించారు. సిఎం రేవంత్ రెడ్డి తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డిజిపి జితేందర్, రాష్ట్ర పర్యాటక శాఖ ఛైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి , మిస్ వరల్డ్ -2024 విజేత క్రిస్టినా పిస్కోవా తదితరులు పాల్గొన్నారు. జయజయహే తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపనతో కార్యక్రమం ప్రారంభించారు.
తెలంగాణ సంస్కృతి , సంప్రదాయాలు ఉట్టిపడేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 250 మంది కాళాకారులతో పేరిణి నృత్య ప్రదర్శన నిర్వహించారు.
నగరానికి చేరుకుంటున్న ప్రపంచ సుందరీమణులు..