ఓరుగల్లులో సందడి చేసిన ప్రపంచ సుందరీమణులు

వరంగల్ (CLiC2NEWS): మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొనే ప్రపంచ సుందరీమణులు తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం వరంగల్‌లో పర్యటించారు. చారిత్రక కట్టడం రామప్ప ఆలయంను సందర్శించారు. రామప్ప ఆలయంలో సుందరీమణులు చీరకట్టులో మెరిశారు. అందరూ గ్రూప్ ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. అందాల భామలు వరంగల్ చేరుకోగానే వారికి బతుకమ్మ, మేళతాళాలతో స్వాగతం పలికారు. హరిత కాకతీయ వద్ద ప్రపంచ సుందరీమణులు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి సందడి చేశారు.