ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ఇల్లు వదిలి వెళ్లిన బాలిక హత్య

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన బాలిక మృతదేహం తుక్కుగూడ ప్లాస్టిక్ వ్యర్థాల పరిశ్రమ వద్ద పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఆ బాలిక ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తి పెళ్లి చేసుకుంటానని చెప్పగా ఇల్లు వదిలి వెళ్లింది. పెళ్లికి ఒత్తిడి చేయగా చంపేసి చెత్తకుప్పల్లో విసిరేశాడు. ప్రధాన నిందితుడితోపాటు అతనికి సహకరించిన స్నేహితుడు, అతడి భార్యను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ టిఎన్‌నగర్‌కు చెందిన బాలిక ఇంటర్ పూర్తిచేసి ఖాళీగా ఉంటుంది. తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉప్పుగూడకు చెందిన బ్యాండ్ వాయించే విఘ్నేశ్ (చింటూ)పరిచయ మయ్యాడు. అతని కోసం బాలికి అక్టోబర్ 20న ఇల్లు వదిలి వెళ్లింది. విఘ్నేశ్ కు స్నేహితుడైన సాకేత్ వాళ్ల ఇంట్లో బాలికను ఉంచాడు. అనంతరం అందరూ కలిపి మీర్‌పేటలోని శ్రీదత్త నగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అయితే బాలిక తన స్నేహితులతో ఉంటున్నట్లు తల్లి, సోదరికి చెప్పింది. బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన విఘ్నేశ్ అత్యచారానికి పాల్పడ్డాడు. ఆమె పెళ్లికి ఒత్తిడి చేయడంతో ఇంట్లోనే దండలు మార్చుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామని బాలిక ఒత్తిడి తేగా.. నవంబర్ 7న బాలికను హతమార్చాడు. మృతదేహాన్ని సాకేత్‌తో కలిసి శ్రీశైలం జాతీయ రాహదారి తుక్కుగూడ సమీపంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల పరిశ్రమలో తుక్కులో పడేశాడు. బాలిక తరచూ తల్లితో మాట్లాడుతూ ఉండేది. ఈ నెల 8 తర్వాత విఘ్నేశ్ ఆమె తల్లి దండ్రులకు ఫోన్ చేసి బాలికి తన దగ్గర లేదు.. మీఇంటికి వచ్చిందా అని అడిగాడు. రెండు రోజులైనా కుమార్తె వద్ద నుండి ఫోన్ రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విఘ్నేశ్‌ను పోలీసులు విచారణకు పిలవగా.. అతను వస్తానని చెప్పి ఫోన్ స్వాచాఫ్ చేశాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు.