బిజెపి ఎమ్మెల్యే బసన గౌడపై ఆరేళ్లు బహిష్కరణ వేటు..

బెంగళూరు (CLiC2NEWS): ఎమ్మెల్యే బసనగౌడపై ఆరేళ్ల పాటు బహిష్కరణ వేటు పడింది. కర్ణాటక బిజెపి ఎమ్యెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ పై పార్టి బహిష్కరణ వేటు వేసింది. పార్టితో పాటు మాజి సిఎం బిఎస్ యడియూరప్పకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఫిబ్రవరి 10వ తేదీన షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తాజాగా ఆయనపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఆరేళ్ల పాటు పార్టి ప్రాథమిక సభ్యత్వం నుండి బహిష్కరించినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంటూ బిజెపి కేంద్ర క్రమశిక్షణ కమిటి ఆయనకు లేఖ రాసింది. ముక్కుసూటిగా
మాట్లాడినందుకు తనకు పార్టి ఇచ్చిన బహుమతిగా ఎమ్మెల్యే బసనగౌడ పేర్కొన్నారు. వారసత్వ రాజకీయాలు, అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు .. ఉత్తర కర్ణాటకను అభివృద్ది చేయాలని అడిగినందుకు తనను ఆరేళ్ళ పాటు పార్టి నుండి బహిష్కరించారని ఆరోపించారు,. అవినీతి , కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా.. ఉత్తర కర్ణాటక అభివృద్ధి , హిందుత్వ కోసం తన పోరాటం కొనసాగుతుందన్నారు. ఉత్సాహం, దృఢ సంకల్పంతో ప్రజాసేవ చేస్తానని, తనకు అండగా నిలిచిన అందరికీ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు.