ఎమ్మెల్యే అభ్య‌ర్థి వ‌యోప‌రిమితి త‌గ్గించాలి: సిఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ (CLiC2NEWS): అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు పోటీచేసే అభ్య‌ర్థుల వ‌యోప‌రిమితి 21 ఏళ్ల‌కు త‌గ్గించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయ బాల‌ల దినోత్సం సంద‌ర్బంగా గురువారం ఎన్‌సిఇఆర్‌టిలో విద్యార్థులు నిర్వ‌హించిన అండ‌ర్-18 మాక్ అసెంబ్లీ కార్య‌క్ర‌మంలో సిఎం పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా మాట్లాడుతూ.. ఓటు హ‌క్కు పొందేందుకు వ‌యోప‌రిమితిని 18 సంవ‌త్స‌రాల‌కు త‌గ్గించార‌ని.. శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి 25 ఏళ్ల వ‌య‌సు నిబంధ‌న‌ను మాత్రం స‌వ‌రించ‌లేద‌న్నారు. వ‌యోప‌రిమితి 21 ఏళ్లకు త‌గ్గిస్తే యువ‌త చ‌ట్ట‌స‌భ‌ల్లో ప్ర‌తినిధ్యం వ‌హించేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా 21 ఏళ్లు నిండిన వారు ఐఎఎస్‌, ఐపిఎస్‌లుగా ప‌నిచేస్తున్న‌పుడు .. 21 ఏళ్లు నిండిన వారు ఎమ్మెల్యేలుగా రాణిస్తార‌ని బ‌లంగా న‌మ్ముతున్న‌ట్లు తెలిపారు. మాక్ అసెంబ్లీ తీర్మానాల్లో ఈ అంశాన్ని కూడా చేర్చి రాష్ట్రప‌తి, ప్ర‌ధాన‌మంత్రికి పంపించాల‌ని స్పీక‌ర్‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నాన‌ని సిఎం అన్నారు.

Leave A Reply

Your email address will not be published.