‘కారు’ దిగిన ఎమ్మెల్యే రేఖానాయక్..
హైదరాబాద్ (CLiC2NEWS): నిర్మాల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ బిఆర్ ఎస్‌కు రాజీనామా చేసు్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో మహిళలకు గౌరవం లేదని.. అందుకే పార్టీని వీడుతున్నట్లు ఆమె తెలిపారు. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. కానీ ఏ పార్టీ నుండి ఆమె పోటీ చేస్తారన్నాది వెల్లడించలేదు. మరోవైపు రేఖానాయక్ భర్త శ్యామ్ నాయక్ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో బిఆర్ ఎస్ పార్టీకి ఆమె రాజీనామా చేయడం.. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకాటించిన అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాలో రేఖా నాయక్ పేరు లేకపోవడంతో ఆమె అసంతృప్తికి గురయ్యారు. ఖానాపూర్ అభ్యర్థిగా జాన్సన్ నాయక్‌ను బరిలోకి దింపాలని పార్టీ నిర్ణయించింది.