తీహాడ్ జైలునుండి ఎమ్ఎల్‌సి కవిత విడుదల..

ఢిల్లీ (CLiC2NEWS): మద్యం కేసు వ్యవహారంలో ఎమ్ ఎల్‌సి కవిత జైలు నుండి విడుదలైయ్యారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమెమై ఇడి, సిబిఐ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు ఐదు నెలలుగా తీహాడ్ జైలులో ఉన్న ఆమెకు మంగళవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జరిగిన సుదీర్ఘ విచారణ అనంతరం జస్టిస్ బార్ గవాయి, జస్టిస్ కె.వి.విశ్వానాథన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 9 గంటల అనంతరం ఆమె విడుదలయ్యారు. పిఎంఎల్ ఎ చట్టంలోని సెక్షన్ 45(1)లోని నిబంధనలను అనుసరించి ఇలాంటి కేసుల్లో మహిళలను ప్రత్యేక కేటగిరీగా చూడాలని సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం స్పష్టం చేసింది. చుదువుకున్న , ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలు దుర్బల విభాగంలోకి రారని, అలాంటి వారిని సెక్షన్ 45(1) కింద పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని గతంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును తప్పుబట్టిన ధర్మాసనం.. కవిత బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఇచ్చిన తీర్పును కొట్టేస్తున్నట్లు ప్రకటించింది.
బెయిల్ పిటిషన్ విచారణలో కవిత తరపు న్యాయవవాదులు శేషాద్రి నాయుడు, విక్రమ్‌చౌధరిలతో కలిసి సీనియర్ న్యాయవాధి ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ కేసులో కవిత పాత్రను నిరూపించే ఆధారాలేవీ లేవన్నారు. ఇడి కేసులో ఇప్పటికే విచారణ పూర్తియింది. సిబిఐ కేసులో అభియోగపత్రం దాఖలు చేవారు. ఈ రెండు కేసుల్లో దర్యాప్తు పూర్తయినందున ఆమె కస్టడీని కొనసాగించాల్సిన అవసరం లేదు. సిసోడియా కేసులో మాదిరిగా ఈ కేసులోనూ 493 మంది సాక్షులను వచారించాల్సి ఉంది. 50 వేలకు పైగా దస్తావేజులను పరిశీలించాల్సి ఉంది. పైగా ఆమె నుండగి ఎలాంటి నేరపూరిత ఆర్జిత సొమ్మునూ దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకోలేదు. పిటిషనర్ మహిళ కాబట్టి పిఎంఎల్ ఎ చట్టంలోని సెక్షన్ 45(1) నిబంధన ప్రకారం ఆమెకు బెయిల్ పొందే అర్హత ఉంది అని పేర్కొన్నారు. ట్రయల్ కోర్టులో పాస్‌పోర్టు అప్పగించాలని, ఒక్కో కేసులో రూ. 10 లక్షల పూచీ కత్తు సమర్పించాలని, సాక్షునలు ప్రభావితం చేయడం, సాక్ష్యాలను ధ్యంసం చేయడం వంటి చర్యలకు పాల్పడవద్దని, అవసరమైనపుడల్లా ట్రయల్ కోర్టు ఎదుట హాజరుకావాలనే షరతులు విధిస్తూ ఆమె విడుదలకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
తీహాడ్ జైలునుండి విడుదలైన అనంతరం కవిత మాట్లాడుతూ.. నేను తెలంగాణ బిడ్డను, కెసిఆర్ కుమార్తెను. తప్పుచేసే ప్రసక్తే లేదని కవిత అన్నారు. నేను మంచిదాన్ని.. మెండిదాన్ని. అనవసరంగా జైలుకుపంపి నన్ను జగమెండిని చేశారన్నారు. న్యాయపరంగా , రాజకీయపరంగా పోరాడతామని , నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటామని కవిత అన్నారు. కవిత బెయిల్ పిటిషన్ మంగళవారం సుప్రీంకోర్టు ముందుకు వస్తున్న నేపథ్యంలో బార్ ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు భారీగా అక్కడకు చేరుకున్నారు. మాజి మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి , గంగుల కమలాకర్ , సత్వవతి రాథోడ్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు పాడికౌశిక్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, ముఠాగోపాల్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మాజి ఎంపి కవిత, పలువురు తదితరులు ఢిల్లీ చేరుకున్నారు.