హైదరాబాద్‌కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ (CLiC2NEWS): బిఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఢిల్లీ మద్యం కేసులో తిహాడ్ జైలులో ఉన్న ఆమె మంగళవారం బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో ఆమె నగరానికి చేరుకున్నారు. కవిత వెంట కెటిఆర్, హరీశ్‌రావు, కుటుంబ సభ్యులు ఉన్నారు. హైదరాబాద్‌లో పార్టి శ్రేణులు ఆమెకు స్వాగతం పలికారు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద జై తెలంగాణ అంటూ అందరికీ అభివారం చేశారు. అనంతరం తన నివాసానికి చేరుకున్నారు.
భారీ వాహన శ్రేణితో ర్యాలీగా ఎమ్మెల్సీ కవిత తన నివాసానికి చేరుకున్నారు. బంజారాహిల్స్ లోని తన నివాసంలో ఆమె కెటిఆర్‌కు రాఖీ కట్టారు. ఈ సందర్బంలో ఆమె భావోద్వేగానికి గురయ్యారు.