కాశీ విశ్వ‌నాథుడికి మోడీ జ‌లాభిషేకం..

గంగా న‌దిలో మోడీ ప‌విత్ర స్నానం

కాశీ (CLiC2NEWS): ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ కాశీలోని గంగాన‌దిలో పుణ్య‌స్నానం ఆచ‌రించారు. కాశీ విశ్వ‌నాథ్ కారిడార్‌ను సోమ‌వారం జాతీకి అంకితం చేశారు. ఈ సంద‌ర్భంగా కాశీ ప‌ట్ట‌ణంలో ఆయ‌న ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌ధాని గంగా మాత‌కు పుష్పాలు అర్పించారు. అలాగే ల‌లితా ఘాట్ వ‌ద్ద జ‌ల‌త‌ర్ప‌ణం చేశారు. అనంత‌రం కాషాయ వస్త్రాల్లో గంగా జ‌లాన్ని తీసుకుని వెళ్లి వ‌శ్వ‌నాథుడికి ఆ జ‌లంతో అభిషేకం చేశారు.
ఈ సంద‌ర్భంగా ఆల‌య పూజారులు శాస్త్రాక్తంగా రుద్రాభిషేకం నిర్వ‌మించారు. గంగా న‌ది నుంచి నీటితో ఆల‌యానికి వెళ్తున్న స‌మ‌యంలో అక్క‌డి ప్ర‌జ‌లు ప్ర‌ధాని ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. కొంత దూరం వ‌ర‌కు కారులో వెళ్లి ఆ త‌ర్వాత న‌డుచుకుంటూ స్వామి వారి స‌న్నిధికి వెళ‌ల్ఆరు.

 

 

Leave A Reply

Your email address will not be published.