రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసిన మోడీ..
రామగుండం (CLiC2NEWS): ప్రధానమంత్రి మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఎన్‌టిపిసి టౌన్‌షిప్‌లోని మైదానంలో రైతులతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. ఫర్టిలైజర్ ప్లాంట్, రైల్వేలైన్, రోడ్ల విస్తరణతో తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుందని.. ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయన్నారు. నూతన ప్రాజెక్టులతో జీవన ప్రమాణాలు మెరుగావుతాయన్నారు.
భారత్ .. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్తగా అవతరించింది. అభివృద్ధి పనుల మంజూరు ప్రక్రియలో వేగం పెంచారని.. మేము శంకుస్థాపనలకే పరిమితం కాలేదని, వాటిని వేగంగా పూర్తి చేసి చూపించామని మోడీ అన్నారు. రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని 2016లో శంకుస్థాపన చేసి, దానిని పూర్తి చేసి జాతికి అంకితం చేశామని అన్నారు. యూరియాను విదేశాల నుంచి అధిక ధరకు దిగుమతి చేసుకుంటున్నామని.. రైతులకు ఎరువుల కొరత రాకుండా అనేక చర్యలు చేపట్టడం జరిగింది. ఐదు ప్రాంతాలలోని ఎరువుల కర్మాగారాల్లో 70 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి జరుగుతోందని, తక్కువ ధరకే రైతులకు నీమ్ కోటింగ్ యూరియా అందిస్తున్నామని మోడీ అన్నారు.