కొత్త సర్కార్ తొలి సమావేశం.. 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేబినేట్ గ్రీన్‌సిగ్నల్
ఢిల్లీ (CLiC2NEWS): కేంద్రంలో మూడోసారి మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఆయన పిఎం కిసాన్ నిధి విడుదల దస్త్రంపై తొలి సంతకం చేశారు. దీంతో 9.3 కోట్ల మంది రైతులకు రూ. 20 వేల కోట్ల ఆర్ధిక సహాయం అందనుంది. ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కేబినేట్ సమావేశమైంది. సమావేశంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేబినేట్ ఆమోదించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.