తెలంగాణకు మోదీ ఇచ్చింది గాడిద గుడ్డు: సిఎం రేవంత్ రెడ్డి
![](https://clic2news.com/wp-content/uploads/2023/12/CM-Revanth-Reddy.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): మోదీ తెలంగాణకు చేసేందేమీ లేదని.. ఈ పదేళ్లలో రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం ఇచ్చిందేమీ లేదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అడిగింది బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ అని, కానీ వాళ్లు ఇచ్చింది గాడిద గుడ్డు అని ఆయన విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే.. గాడిదగుడ్డు అని , రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కృష్ణా,గోదావరిలో వాటాల పంపకం.. మేడారం జాతరకు జాతీయ హోదా.. అడిగితే పెద్ద గాడిద గుడ్డు ఇచ్చారని సిఎం ఎద్దేవా చేశారు.