చీపురు ప‌ట్టిన మోడీ.. స్కూలు విద్యార్థులో క‌లిసి స్వ‌చ్ఛ‌భార‌త్‌లో ప్ర‌ధాని

న్యూఢిల్లీ (CLiC2NEWS): మ‌హాత్మాగాంధీ జ‌యంతి సంద‌ర్భంగా పాఠ‌శాల విద్యార్థుల‌తో క‌లిసి ప్ర‌ధాని మోడీ స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా స్వ‌చ్ఛ‌భార‌త్‌లో ప్ర‌జ‌లంతా పాల్గొనాల‌ని ప్ర‌ధాని పిలుపునిచ్చారు.

ఈ మేర‌కు ప్ర‌ధాని ట్విట్ట‌ర్‌లో పోస్టు పెట్టారు.

“ నా యువ మిత్రుల‌తో క‌లిసి నేను స్వ‌చ్ఛ‌తా అభియాన్‌లో పాల్గొన్నాను. మీరు కూడా ఈ కార్య‌క్ర‌మంలో భాగ‌స్వాములు కావాలి. ఇది స్వ‌చ్ఛ‌భార‌త్ స్ఫూర్తిని మ‌రింత బ‌లోపేతం చేస్తుంది“ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.

ప్ర‌ధాని మోడీ పిలుపు మేర‌కు ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు స్వ‌చ్ఛ‌త అభిమాయ‌న్ లో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర‌మంత్రులు జెపి న‌డ్డా, జి కిష‌న్‌రెడ్డి, రాజీవ్ రంజ‌న్‌, మాండ‌వీయ‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్య‌నాథ్‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.