మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్ సేవలు..
మహిళా రోగి నుండి రక్త నమూనా సేకరించి తిరిగి ఎయిమ్స్‌కు..
అమరావతి (CLiC2NEWS): మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్ సేవలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఢిల్లీలోని ఎఐఐఎ నుండి వర్చువల్‌గా ఈ సేవలను ఆవిష్కరించారు. అనంతరం ఎయిమ్స్‌లోని అధికారులు ప్రయోగాత్మకంగా డ్రోన్ పరీక్ష చేపట్టారు. ముందుగా ఎయిమ్స్ నుండి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న నూతక్కి పిహెచ్‌సి వరకు డ్రోన్‌ని పంపారు. ఓ మహిళ నుండి రక్త నమూనాను సేకరించి ఎయిమ్స్ తిరిగి చేరుకుంది. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు డ్రోన్ల ఉపయోగంపై ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలియజేశారు.