పుణె మెట్రో ట్రైన్ ప్రారంభించిన ప్ర‌ధాని మోడి.. టికెట్ కొని రైలులో ప్ర‌యాణం

పుణె (CLiC2NEWS): మ‌హారాష్ట్రలోని పుణెలో మెట్రోట్రైన్‌ను ఆదివారం ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడి ప్రారంభించారు. 32.2 కిలోమీట‌ర్ల మెట్రో ప్రాజెక్టులో 12 కిలోమీట‌ర్ల మేర ప్ర‌స్తుతం పుణె వాసుల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. గ‌ర్వారే స్టేష‌న్‌లో ప‌చ్చ‌జెండా ఊపి మెట్రో సేవ‌లను మోడి ప్రారంభించారు. అనంత‌రం మోడి స్వయంగా టికెట్ కొనుగోలు చేసి గ‌ర్వారే స్టేష‌న్ నుండి ఆనంద్ న‌గ‌ర్ స్టేష‌న్ వ‌ర‌కు 5 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించారు. ట్రైన్‌లో 10 నిమిషాల పాటు ప్ర‌యాణించిన ఆయ‌న కొంత‌మంది దివ్యాంగ చిన్నారుల‌తో మాట్లాడారు.

పుణె మెట్రో ప్రాజెక్టు కోసం మొత్త రూ. 11,400 కోట్లు వెచ్చించారు. దీనిక 2016 డిసెంబ‌రులో ప్ర‌ధాని మోడి శంకుస్థాప‌న చేశారు.

Leave A Reply

Your email address will not be published.