హర్లీన్ డియోల్ క్యాచ్‌కు ప్రధాని మోడీ ఫిదా..

న్యూఢిల్లీ (CLiC2NEWS): టీమిండియా యువ క్రికెట‌ర్ హ‌ర్లీన్ డియోల్ ఒక్క క్యాచ్‌తో రాత్రికి రాత్రే బాగా ఫేమస్ అయ్యారు. ఏకంగా దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హర్లీన్ డియోల్ ను ప్ర‌శంసించారు. ఇంగ్లాండ్‌తో తొలి టి20 లో ఆమె అందుకున్న క్యాచ్ అద్భుత‌మ‌ని పొగిడారు. మున్ముందు కూడా ఇలానే ఆడాల‌ని ప్ర‌ధాని ఆకాంక్షించారు.

మున్ముందు ఇలాగే నీఆటతో ఆకట్టుకోవాలని కోరుతూ ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట చేశారు. మైగవ్ ఇండియా పంచుకున్న వీడియోను షేర్ చేస్తూ మోడీ కామెంట్ చేశారు. ‘అసాధారణం.. వెల్ డన్ హర్లీన్ డియోల్’ అంటూ ట్యాగ్ చేశారు.

టీమిండియా మహిళా క్రికెటర్లు.. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తొలి టీ20 సందర్భంగా నార్తంప్టన్ లో జరిగిన మ్యాచ్ లో తొలుత ఇంగ్లండ్ బ్యాటింగ్ చేసింది. అమీ జోన్స్ దూకుడుగా ఆడుతోంది. బౌలర్లు ఎంత ప్రయత్నించినా వికెట్ దక్కడం లేదు. 43 పరుగుల వద్ద శిఖా ఫాండే వేసిన 18 వ ఓవర్లో వేసిన ఓ బంతిని భారీ షాట్ ఆడింది. బౌండరీ వద్ద ఉన్న హర్లీన్ డియోల్.. అద్భుతంగా మూవ్ అయింది. త‌ల మీదుగా వ‌స్తున్న క్యాచ్‌ను ఎడ‌మ‌వైపు గాల్లోకి డైవ్ చేసి అందుకొంది. ఈ క్ర‌మంలో బౌండ‌రీ అవ‌త‌ల ప‌డిపోతామ‌ని తెలుసుకొని బంతిని గ‌ల్లోకి విసిరింది. బౌండ‌రీ అవ‌త‌లికి వెళ్లి.. మ‌ళ్లీ గాల్లోని బంతిని అందుకొనేందుకు మైదానంలోకి డ్రైవ్ చేసింది. దాంతో విస్తుపోయిన అమీ జోన్స్ నిరాశ‌తో పెవిలియ‌న్ చేరింది.

ఇక అప్పటి నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హర్లీన్ డియోల్ యాక్షన్ కు అంతా ఫిదా అవుతూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ప్ర‌ధాని మోడీ సైతం ఇన్‌స్టా స్టోరీస్‌లో పెట్టి ప్ర‌శంసించారు.

Leave A Reply

Your email address will not be published.