మూడోసారి దేశ ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం..
ఢిల్లీ (CLiC2NEWS): భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన మోడీ ప్రమాణ స్వీకారానికి దేశ, విదేశీ ప్రముఖులు, సార్క్ సభ్య దేశాల నేతలు కలిపి దాదాపు 8వేల మంది హాజరైనట్లు సమాచారం. 2014, 2019, 2024 వరుసగా మూడు సార్లు ఎన్నికల్లో విజయం సాధించి మోడీ మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టారు.
నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత అంతటి ఘనత సాధించిన నేతగా మోడీ చరిత్ర సృష్టించారు. వరుసగా 2014,2019 సార్వత్రికల ఎన్నికల్లో బిజెపి సంపూర్ణ మెజారిటి సాధించింది. 2024 ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమి 293 స్థానాలు దక్కించుకుంది. అటల్ బిహారి వాజ్‌పేయీ అనంతరం మూడోసారి ప్రధానికగా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెసేతర నేత నరేంద్ర మోడీ. అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన మొదటి కాంగ్రెసేతర నాయకుడిగా రికార్డు సృష్టించారు. కేంద్ర మంత్రులుగా పలువురు నేతలు ప్రమాణం చేస్తున్నారు.
కేబినేట్ మంత్రులుగా రాజ్‌నాథ్ సింగ్, అమిత్‌షా, జెసి నడ్డా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మాలా సీతారామన్ , జై శంకర్, హరియాణా మాజి సిఎం మనోహర్ ఖట్టర్, కార్ణాటక మాజి సిఎం హెచ్‌డి కుమారస్వామి , పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ , జితన్ రాం మాంఝీ , లలన్ సింగ్, అస్సాం కు చెందిన సర్బానందం సోనోవాల్ , వీరేంద్ర కుమార్, ఎపికి చెందిన రామ్మోహన్ నాయుడు, ప్రహ్లాద్ జోషి, జువల్ ఓరం , గిరరాజ్ సింగ్, అశ్వని వైష్ణవ్ , జ్యోతిరాదిత్య సింథియా, భూపేంద్ర యాదవ్,గజేంద్రసింగ్ షెకావత్, ఝార్ఖండ్ మహిళా నేత అన్నపూర్ణాదేవి, కిరణ్ రిజిజు పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. మరి కొంతమంది ప్రమాణస్వీకారం చేయనున్నారు.