భారత్ పర్యటనకు విచ్చేసిన ఖతర్ ఎమిర్
ఖతర్ ఎమిర్‌కు స్వాగతం పలికిన ప్రధాని మోడీ

ఢిల్లీ (CLiC2NEWS): భారత్ లో రెండు రోజుల పర్యటన నిమిత్తం ఖతర్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థాని విచ్చేశారు. ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. తన సోదరుడికి స్వాగతం పలికేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లినట్లు.. భారత్‌లో ఆయన పర్యటన విజయవంతం అవుతుందని ఆశిస్తున్నట్ల ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
రేపు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఖతర్ ఎమిర్ సమావేశం కానున్నట్లు సమాచారం. అనంతరం హైదరాబాద్ హౌస్‌లో మోడీతో తమీమ్ బిన్ హమద్ సమావేశం కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు నేతలు చర్చించనున్నట్లు సమాచారం. ఖతర్ ఎమిర్ 2015లో ఓ సారి భారత్‌కు వచ్చారు. తాజాగా ప్రధాని ఆహ్వానంపై మరోసారి భారత్ పర్యటనకు విచ్చేశారు.