మోడీ గొప్ప స్నేహితుడు.. రష్యా అధ్యక్షుడు పుతిన్

మాస్కో (CLiC2NEWS): రష్యాకు గొప్ప స్నేహితుడు అయిన ప్రధాని మోడీ అంటూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోడీ విధానాలను ప్రశంసించారు. మాస్కోలో నిర్వహించిన దేశీయ ఉత్పత్తులు, బ్రాండ్లను పోత్సహించే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మోడీ కొన్ని సంవత్సరాలం క్రితం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మేకిన్ ఇండియా.. భారత్ ఆర్ధిక వ్యవస్థలో సత్ఫలితాలనిస్తుంది. మనం కాకపోయినా.. మన స్నేహితుడు చేసిందైనా సత్ఫలితాలనిస్తుంటే అనుకరించడం తప్పేమీ కాదు. అని పుతిన్ అన్నారు.