మోడీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్?

న్యూఢిల్లీ (CLiC2NEWS): నిన్న వెలువడిన ఫలితాల్లో ఎన్డీయే కూటమికి అత్యధిక సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. ఈ హ్యట్రిక్ విజయంతో వరుసగా ప్రధాన మంత్రి మోడీ మూడో సారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ప్రమాణ స్వీకారానికి మూహూర్తం ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. మూడో సారి ప్రధానిగా జూన్ 8న సాయంత్రం ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ వేడక కు ఎన్డీయే కూటమి నాయకులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నట్లు సమాచారం.
[…] […]