మనోజ్‌పై మోహన్‌బాబు పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్ (CLiC2NEWS): మంచు మోహన్‌బాబు తన కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడు, కోడలిపై చర్యలు తీసుకోవాలని రాచకొండ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తన ఆస్తులకు , ప్రాణానికి రక్షణ కల్పించాలని మోహన్‌బాబు పోలీసులను ఆశ్రయించారు. నాకు హాని కలిగించే ఉద్దేశంతో వారున్నారని, నా ఇంట్లో ఎలాంటి భయం లేకుండా గడిపేందుకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. .
తాను జల్‌పల్లిలో 10 సంవత్సరాలుగా ఉంటున్నానని, తన చిన్న కొడుకు మనోజ్ 4 నెలల కిందట ఇల్లువదిలి వెళ్లాడన్నారు. మనోజ్ తన 7 నెలల కుమార్తెను పనిమనిషి సంరక్షణలో విడిడి వెళ్లాడు, అతను కొందరు సంఘ వ్యతిరేకులతో వచ్చి తన ఇంటిముందు కలవరం సృష్టించాడని తెలిపారు. తాను 70 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్‌నని.. తన నివాసాన్ని శాశ్వతంగా ఖాళీ చేయాలని, చట్టవిరుద్ధంగా ఇంటిని స్వాధీనం చేసేందుకు వారిద్దరూ ప్లాన్ చేస్తున్నారని, మనోజ్, అతని భార్య, సహచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తన భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించాలని మోహన్‌బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు.