‘మా’ సభ్యులకు మోహన్‌బాబు వాయిస్‌ మెస్సేజ్‌..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగు సినిమా మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ ఎన్నికలకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది. మ‌రో 24 గంట‌లు కూడా సమయం కూడా లేకపోవడంతో అటు ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌, ఇటు మంచు విష్ణు ప్యానెల్‌ తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఇటూ ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌, అటూ మంచు విష్ణు ప్యానల్‌ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ పో ఇప్పటికే ఇరువర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకోగా.. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ గెలుపు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఆదివారం ఉదయం ఎన్నికలు జరుగనుండగా.. తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

ఇదిలా ఉండగా.. మంచు విష్ణు ప్యానెల్‌ విజయం కోసం సీనియ‌ర్ న‌టుడు, విష్ణు తండ్రి మోహన్‌ బాబు రంగంలోకి దిగారు. ఎన్నికల్లో విష్ణుకే ఓటు వేయాలని అసోసియేష‌న్ సభ్యులకు వాయిస్‌ మెస్సేజ్‌ పంపారు.

“తెలుగు వాళ్లు ఒకటిగా ఉండాలనే ‘మా’ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ‘మా’ ఎన్నికల పరిస్థితి చూస్తే మనసుకు కష్టంగా ఉంది. ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుందామని పెద్దలు అనేవారు. అయితే, కొంతమంది సభ్యులు రోడ్డునపడి నవ్వులపాలవుతున్నారు. ఎవరు ఏం చేసినా ‘మా’ అనేది ఒక కుటుంబం. విష్ణు గెలిచాక రెండు రాష్ట్రాల సీఎంలను కలుస్తాం. సినీ పరిశ్రమ కష్టాలను వారికి చెప్పుకుందాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను విష్ణు నెరవేరుస్తాడనే నమ్మకం ఉంది. విష్ణు మీ కుటుంబ సభ్యుడు. ఓటు వేసే ముందు మనస్సాక్షితో ఆలోచించి ఓటు వేయండి“ అని వాయిస్‌ మెస్సేజ్‌లో కోరారు.

Leave A Reply

Your email address will not be published.