Muharram: ఎపిలో 20న మొహర్రం సెలవు
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో మొహర్రం సెలవును ప్రభుత్వం ఖరారు చేసింది. మొహర్రం మాసం 10వ రోజు ఇచ్చే సాధారణ సెలవును ఆగస్టు 19వ తేదీ నుంచి 20వ తేదీకి మారుస్తూ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది.
20న మొహర్రం నిర్వహణకు ఇవాళ (బుధవారం) ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ జామా మసీదు ప్రకటన ఆధారంగా మొహర్రం నిర్వహణ తేదీల్లో మార్పులు చేసినట్టు ప్రబుత్వం ప్రకటనలో పేర్కొంది.