హైదరాబాద్‌లోని పాఠశాలలకు సోమవారం సెలవు

హైదరబాద్ (CLiC2NEWS): నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలియజేయడంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా నగరంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. హైదరాబాద్‌లో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏమైనా సమస్యలు ఉంటే హైదరాబాద్ కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్ 040-23202813, 9063423979 , హైదరబాద్ ఆర్‌డిఒ 7416818610, 9985117660, సికింద్రాబాద్ ఆర్‌డిఒ 8019747481 ఫోన్ నంబర్‌లను సంప్రదించాలని సూచించారు.