గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా మంకీపాక్స్.. WHO ప్రకటన
జెనీవా (CLiC2NEWS): మంకీపాక్స్ క్రమంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు 75 దేశాల్లో 16 వేలకు పైగా కేసులు నమోయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. మంకీపాక్స్ ను డబ్ల్యు హెచ్ ఓ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా కేసులు అధికమవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.
నిపుణుల కమిటీ సూచించిన నేపథ్యంలో సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ ప్రకటించారు. యూరప్ ప్రాంతంలో ప్రమాదం ఎక్కువగా ఉందని అంచనా వేశారు. మంకీపాక్స్ ప్రపంచ వ్యాప్తంగా మరింతగా విస్తరించే వీలుందని తెలిపారు. మంకీపాక్స్ పై పోరాటానికి ప్రంపంచ దేశాల మధ్య సమన్వయం అవసరమని టెడ్రోస్ స్పష్టం చేశారు. మశూచి టీకాలు కొంత రక్షణ కలిగిస్తాయని తెలిపారు. కాగా వైరస్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు కొత్త టీకాలు అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు.